‘ధురంధర్’ సిరీస్ ఖాతాలో అరుదైన రికార్డ్ ఏంటో తెలుసా!

‘ధురంధర్’ సిరీస్ ఖాతాలో అరుదైన రికార్డ్ ఏంటో తెలుసా!

Published on Mar 27, 2026 1:00 AM IST

dhurandhar 6

బాలీవుడ్ సినిమా నుంచి ఈ 5 నెలల గ్యాప్ లోనే వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రాలే ధురంధర్ రెండు భాగాలు. దర్శకుడు ఆదిత్య ధర్, హీరో రణ్వీర్ సింగ్ కలయికలో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో ఏకంగా 8 గంటల రన్ టైం ఉన్నప్పటికీ ఆడియెన్స్ ని కూర్చోబెట్టి సాలిడ్ ట్రీట్ ని అందించింది. అయితే ఈ సిరీస్ ఖాతాలో చాలా రేర్ రికార్డ్ యాడ్ అయ్యిందని చెప్పవచ్చు. ఇది వరకు ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన సీక్వెల్ లేదా ప్రీక్వెల్స్ రెండూ 1000 కోట్లు దాటిన సినిమాలు లేవు.

కానీ ఈ ఫీట్ ని ప్రస్తుతం ధురంధర్ సిరీస్ సెట్ చేసుకుంది. పార్ట్ 1 కి 1300 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. ఇప్పుడు పార్ట్ 2 కేవలం 10 రోజుల్లోపే ఈ ఫీట్ ని క్రాస్ చేసి లాంగ్ రన్ లో 2000 కోట్లపై కూడా కన్నేసింది. ఇలా రెండు భాగాలూ 1000కోట్లు గ్లోబల్ వసూళ్లు అందుకున్న సినిమాగా ఇది నిలిచింది అని చెప్పవచ్చు. మరి ఫ్యూచర్ లో ఈ సరికొత్త లిస్ట్ లో ఏ సినిమా చేరుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు