
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 9వ సినిమా ‘బ్రూస్ లీ’. ‘ది ఫైటర్’ అనేది ఈ సినిమాకి ఉపశీర్షిక. యాక్షన్ – కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. సినిమా మొదలు పెట్టిన నాటి నుంచి గ్యాప్ తీసుకోకుండా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మొదటగా రెండు పాటలను యూరప్ లో షూట్ చేసిన టీం ఆ తర్వాత ఓన్లీ టాకీ పార్ట్ పైనే దృష్టి పెట్టింది. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ సినిమా 80% టాకీ పార్ట్ ని పూర్తి చేసుకుంది.
మరి కొద్ది రోజుల్లో టాకీ పార్ట్ మొత్తాన్ని ఫినిష్ చేసి సాంగ్స్ ని చివర్లో షూట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత ఫైనల్ టాకీ పార్ట్ ని ఫినిష్ చెయ్యడానికి ఈ చిత్ర టీం బ్యాంకాక్ వెళ్లనుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తన రియల్ లైఫ్ పాత్రలో కనిపించనున్నాడు. చిరు పార్ట్ కి సంబందించిన సీన్స్ ని కూడా త్వరలోనే షూట్ చేయనున్నారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. చిరు బర్త్ డే కానుకగా రిలీజ్ అయిన బ్రూస్ లీ ఫస్ట్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

