100 కోట్లు వచ్చినా, ఫ్లాప్ గా ముగిసిన 83!

Published on Jan 12, 2022 8:04 pm IST

రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన 83 భారీ స్థాయిలో రూపొందిన భారీ చిత్రం. ఈ సినిమా చాలా కాలం క్రితమే విడుదల కి సిద్ధంగా ఉంది. కానీ, కోవిడ్ కారణంగా వాయిదా పడింది. కొన్ని వారాల క్రితమే ఈ చిత్రం విడుదలై మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఈ చిత్రం ఇప్పుడు ఎట్టకేలకు 100 కోట్ల మార్క్‌ను దాటింది. అయినా ఫ్లాప్‌గా పరిగణించబడుతుంది.

ముంబైలోని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మరియు ఎగ్జిబిటర్‌లలో ఒకరు మాట్లాడుతూ, చిన్న పట్టణంలోని ప్రేక్షకులు 83 పై అస్సలు ఆసక్తి చూపడం లేదని, మరియు పుష్ప లాంటి చిత్రాన్ని చూడాలనుకుంటున్నారని చెప్పారు. భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమా సేఫ్ జోన్‌లో ఉండాలంటే దాదాపు 160 కోట్లు కావాలి. ఇప్పుడు ఈ చిత్రం ముగింపు దశకు చేరుకుంది మరియు త్వరలో OTTలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా ముగుస్తుంది.

సంబంధిత సమాచారం :