లార్డ్స్ వేదికగా ’83’ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్…!

Published on Jun 26, 2019 10:21 pm IST

రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో కపిల్ దేవ్ బయోపిక్ ’83’ టైటిల్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు కబీర్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ లో కపిల్ భార్య పాత్రలో దీపికా పదుకొనె నటిస్తున్నారు. ఐతే ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర విషయం ఒకటి బయటకొచ్చింది. కపిల్ దేవ్ సారధ్యంలో 1983లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సన్నివేశాన్ని లండన్ లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో తెరకెక్కించాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. 1983నాటి పరిస్థితులు, వాతావరణం ఖచ్చితంగా ప్రతిభింబిచే విధంగా చిత్ర యూనిట్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ మూవీని హీరో రణ్వీర్ తో పాటు దర్శక నిర్మాతలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నారని సమాచారం.

ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ ముగిసిన తరువాత చిత్రీకరించనున్నారు. తమిళ హీరో జీవా,హార్డీ సంధు,అమ్మి విర్క్ వంటి నటులు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ మూవీని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా,వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More