9 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న “నీలాంబరి”

9 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న “నీలాంబరి”

Published on Nov 11, 2021 11:48 AM IST

neelambari 2

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రం లో రామ్ చరణ్ సిద్ద పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కి జోడీ గా పూజ హెగ్డే నటిస్తుంది. ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ లు నటిస్తుండటం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. కాగా ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన నీలాంబరి లిరికల్ వీడియో సాంగ్ కి విశేష స్పందన వస్తోంది. ఈ లిరికల్ వీడియో కి యూ ట్యూబ్ లో 9 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

తాజా వార్తలు