కరీంనగర్ లో ’90ML’ ప్రీ రిలీజ్ ఈవెంట్ !

Published on Dec 3, 2019 9:52 pm IST

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో హీరోగా యువతలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ ఇప్పుడు 90ML తో మనముందుకు రాబోతున్నాడు. నేహా సోలంకి హిరోయిన్ గా కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి యర్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు.

డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కరీంనగర్లో ఏర్పాటు చేయగా, భారీ జనసందోహం మధ్య జే మీడియా అధినేత నరేంద్ర గారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తదితర రాజకీయనాయకులు ముఖ్య అతిధులుగా విచ్చేయగా, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడ మరియు ఆట సందీప్ వంటి వారు ఆటలు, డాన్సులు, పాటలతో అందరినీ అలరించారు.

సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ ” ఈ చిత్రంలో చాలా హైలైట్స్ ఉన్నాయి, ముఖ్యంగా కార్తికేయ డాన్స్ ఇరగదీసాడు. నేహా సోలంకి ఈ చిత్రంలో హీరోయిన్ గా అద్భుతంగా నటించింది. కార్తికేయకి తనకి మధ్యన చిత్రంలో నడిచే ప్రేమ సన్నివేశాలు చాలా కొత్తగానూ ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. ఫైట్స్, కామెడీతో పాటు మంచి ఎమోషనల్ సన్నివేశాలతో 90ML పూర్తి కమర్షియల్ ఎంటెర్టైనర్ గా రాబోతుంది’ అని అన్నారు.

సంబంధిత సమాచారం :

More