యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం 90ఎంఎల్. ఈ చిత్రంలో నేహా సోలంకి హిరోయిన్ గా నటిస్తుండగా కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి యెర్రా దర్శకత్వంలో తెరకెక్కుతుంది. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు. లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సంధర్భంగా శనివారం చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. డైరెక్టర్ అజయ్ భూపతి సినిమా బిగ్ సీడీని లాంచ్ చేశారు.
కార్తికేయ మాట్లాడుతూ.. ‘ఇదొక ఫ్యామిలీ ఈవెంట్ లా ఉంది. ఇంతగా సపోర్ట్ ఇచ్చిన అభిమానులకు ముందుగా నా ప్రత్యేక కృతజ్ఞతలు. మొదట దర్శకుడు శేఖర్ వేరే కథ చెప్పారు. ఆ తరువాత ఫస్ట్ హాఫ్ వరకు సెట్ చేసుకున్న 90ఎంఎల్ అనే కథ చెప్పారు. మందు తాగకపోతే బ్రతకని ఒక వ్యక్తి అలాగే మందు వాసన అంటే పడని ఒక తండ్రి యొక్క కూతురికి మధ్య నడిచే లవ్ స్టోరీ అనగానే నాకు బాగా నచ్చేసింది. అప్పుడు ఫస్ట్ హాఫ్ ఒక్కటే చెప్పారు. ఒకరోజు ఫోన్ చేసి 90ఎంఎల్ టైటిల్ అనగానే డిఫరెంట్ గా అనిపించింది. అప్పుడే మంచి బడ్జెట్ లో సినిమాను నిర్మించాలని సొంతంగా మా హోమ్ బ్యానర్ లో సినిమాని నిర్మించడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసి హీరో అవ్వాలని అనుకున్నా. నేను చేసిన ప్రతి సినిమాలో నేను అంత బాగా నటించడానికి కారణం నా దర్శకులు. నా పేరెంట్స్ అలాగే నా బాబాయ్ నా కోసం మరోసారి సపోర్ట్ చేశారు. వీళ్ళే నా బ్యాక్ గ్రౌండ్. ఆర్ఎక్స్ 100తో డబుల్ ప్రాఫిట్స్ అందుకున్నాము. ఇక ఇప్పుడు సినిమా చూశాక త్రిబుల్ ప్రాఫిట్స్ వస్తాయి. ఈ సినిమా నాకు చాలా ముఖ్యం. అందరికంటే ఎక్కువగా శేఖర్ గారికి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి. 15 ఏళ్ల నుంచి ఎంతో స్త్రగుల్ అవుతున్న శేఖర్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. రవి కిషన్ గారు ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. సాధారణంగా ఆయనను రేసుగుర్రం రవికిషన్ అంటారు. ఇక ఇప్పుడు 90ఎంఎల్ రవికిషన్ అంటారు. ఇతర నటీనటులు కూడా చాలా కష్టపడ్డారు. నేను విలన్ గా చేసినా హీరోగా చేసినా ఏం చేసినా ఆడియన్స్ ఆదరిస్తారు అనే ఒక ధైర్యం వచ్చింది. నా దృష్టిలో మెగాస్టార్ – మహేష్ నిజమైన హీరోలు. వారే నాకు స్ఫూర్తి. ఇక మిగతా టెక్నీషియన్స్ కూడా సినిమా కొరకు చాలా శ్రమించారు. ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేయడానికి నేను ఎలాంటి పాత్రలైనా చేస్తాను. ఫైనల్ గా డిసెంబర్ 5న మా సినిమాతో 90ఎంఎల్ కాదు.. 900ఎంఎల్ కిక్ వస్తది. ఈ సినిమా ఆల్కహాల్ ని ప్రోత్సహించదు. ఈ సినిమా ఆరోగ్యకరమైన కిక్ ఇస్తది” అని లిక్కర్ డైలాగ్ చెప్పి ఆడియెన్స్ చేత కార్తికేయ విజిల్స్ వేయించారు.
