యంగ్ “బాహుబలి” నటుడితో 90s సిరీస్ దర్శకుడు

మన తెలుగు ఓటిటి కంటెంట్ నుంచి వచ్చిన పలు వెబ్ సిరీస్ లలో ఈటీవీ విన్ లో ప్రసారం కి వచ్చిన సిరీస్ “90స్ – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్” కూడా ఒకటి. మరి మళ్ళీ పాత రోజులని గుర్తు చేస్తూ యంగ్ దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన విధానంకి మంచు మార్కులే పడ్డాయి. అయితే ఈ యువ దర్శకుడు నెక్స్ట్ మళయాళ చిత్రం “ప్రేమలు” తెలుగు వెర్షన్ కి డైలాగ్స్ ని తాను అందించాడు.

అయితే తాను నెక్స్ట్ కూడా ఓ సిరీస్ నే చేయనుండగా ఈ సిరీస్ కోసం బాహుబలి నటుడు నిఖిల్ దేవాదుల లాక్ అయినట్టుగా తెలుస్తుంది. నిఖిల్ బాహుబలిలో ప్రభాస్ కి యంగ్ వెర్షన్ లో నటించాడు. మరి ఇప్పుడు ఆదిత్య హాసన్ తో కోలాబ్ అవుతున్నాడు. అయితే ఈ కాంబినేషన్ పై ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి క్లారిటీ రానుంది. ఇక ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ సిరీస్ కి అజీమ్ మహమ్మద్ సంగీతం అందిస్తుండగా నవీన్ మేడారం నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఓటిటి పార్ట్నర్ సంబంధించి ఇతర వివరాలు ఈరోజు సాయంత్రం రానున్నాయి.

Exit mobile version