96 తెలుగు రీమేక్ షూటింగ్ షురూ !

Published on Apr 17, 2019 3:48 pm IST


గత ఏడాది తమిళంలో విడుదలై సూపర్ హిట్ అయిన 96 చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్ లో శర్వానంద్ , సమంత జంటగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. మారిషస్ లో ఈరోజు , రేపు ఒక సాంగ్ చిత్రీకరణ జరిపి ఆ తరువాత చిత్ర బృందం కెన్యా వెళ్లనుంది. 12 రోజుల పాటు అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి జాను అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈచిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈసినిమా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :