పవన్ లుక్ పై క్లారిటీ వచ్చినట్టేగా.!

Published on Sep 26, 2020 9:01 am IST

ప్రస్తుతం టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” సహా మరిన్ని ప్రాజెక్టులలో నటిచనున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యలోనే సోషల్ మీడియాలో మన హీరోలకు సంబంధించి పలు అన్ పిక్స్ వైరల్ అవ్వడం మొదలు పెట్టాయి. అలా ఆ ట్రెండ్ లో పవన్ కు సంబంధించి రెండు ఫోటోలు బయటకొచ్చి వైరల్ అయ్యాయి. అయితే వాటిలో ఒకటి మాత్రం పవన్ లేటెస్ట్ చిత్రం అయినటువంటి వకీల్ సాబ్ లోనిదే అని రూమర్స్ వచ్చాయి.

కానీ అందులో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. ఆ ఫోటోలో గడ్డం లుక్ తోనే ఉన్నప్పటికీ పవన్ చాలా స్లిమ్ గా కనిపిస్తున్నారు. కానీ తాజాగా ది గ్రేట్ సింగర్ ఎస్ పి బాలు గారికి నివాళులు తెలియజేస్తూ అందించిన వీడియో చూసాక చాలా మందికి ఒక క్లారిటీ వచ్చింది. వైరల్ అవుతున్న పవన్ లుక్ లో ఎలాంటి నిజమూ లేదని తేలిపోయింది. ప్రస్తుతం పవన్ నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని సంక్రాంతి రేస్ లో నిలిపే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More