బుమ్రా, అనుపమ పెళ్లి రచ్చపై క్లారిటీ ఇదే.!

Published on Mar 6, 2021 12:01 pm IST

మన దక్షిణాది యువ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు పలు ఆసక్తికర చిత్రాల్లో తాను నటిస్తుంది. మరి ఇదిలా ఉండగా మన ఇండియన్ క్రికెట్ టీం యార్కర్ స్పెషలిస్ట్ బుమ్రాకు ఈమెకు రిలేషన్ ఉంది అని ఎప్పటి నుంచి రూమర్స్ ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై సరైన ఆధారాలు లేవు కానీ ఓ టాక్ అయితే ఉంది.

మరి ఇదిలా ఉండగా లేటెస్ట్ గత నాలుగైదు రోజులు నుంచి అయితే ఈ ఇద్దరికీ కొన్ని సంఘటనలు వేర్వేరుగా యాదృచ్చికంగా కలవడంతో వీరిద్దరి పెళ్ళికి నిశ్చయం అయ్యిందని రూమర్స్ ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అనుపమ గుజరాత్ లోని ద్వారకకు వెళ్తున్నాని అలాగే మరో పక్క బుమ్రా కూడా తాను గుజరాత్ వెళ్తున్నట్టుగా తమ సోషల్ మీడియాలో తెలిపారు.

దీనితో అక్కడ నుంచి మొదలయ్యింది రచ్చ. వీళ్ళకి పెళ్లి ఫిక్స్ అయ్యిపోయింది అని అనేక రకాల టాక్స్ ఈ నాలుగు రోజుల గ్యాప్ లో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. కానీ ఈ రూమర్స్ అన్నిటికి అనుపమ తల్లి చెక్ పెట్టేసారు. ఓ మళయాళం పోర్టల్ తో మాట్లాడుతూ అసలు ఇదంతా చెత్త అని ఆ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని అను తన ఓ తెలుగు సినిమా షూట్ నిమిత్తం వెళ్ళింది తప్పితే వేరే ఏం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :