రాజమౌళి, మహేష్ ల భారీ సినిమాపై ఓ క్లారిటీ ఇదే.!

Published on May 31, 2021 4:00 pm IST

మన టాలీవుడ్ లో భారీ ఫాలోయింగ్ ఉన్నటువంటి అగ్ర హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. అయితే మహేష్ ఒక పాన్ ఇండియన్ సినిమా చెయ్యాలని అలాగే రాజమౌళితో కూడా ఒక సినిమా చెయ్యాలని దశాబ్ద కాలం కిందటి నుంచే పెద్ద రిక్వెస్ట్ ఉంది. మరి రెండు కలిపి ఒకేసారి ఇంకొన్నాళ్లలో నెరవేరనుంది. మరి ఈ సెన్సేషనల్ కాంబోపై ఎనలేని అంచనాలు నెలకొని ఉండగా ఈ సినిమా ప్లాట్ పై కొన్నాళ్ల నుంచి ఒక గాసిప్ ఉంది.

ఈ చిత్రం సెటప్ అంతా ఆఫ్రికన్ అడవుల్లో ఉంటుందని ఆ నేపథ్యంలోనే ఒక ఫారెస్ట్ డ్రామాగా ఉంటుందని తెలిసింది. కానీ అదంతా జస్ట్ రూమర్ అని అంత వరకు ఎందుకు అసలు ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటో తనకు కూడా తెలీదని నిర్మాత నారాయణ గత కొన్ని రోజులు కితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలియజేసారు. ఇంకా ఈ చిత్రం స్క్రిప్ట్ దశలోనే ఉందని మరో ఇన్ఫో కూడా ఇచ్చారు. సో ఈ చిత్రం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన టాక్ పై ఎలాంటి నిజమూ లేదని ప్రస్తుతానికి కన్ఫర్మ్ అయ్యింది. మరి రాజమౌళి ఈ భారీ చిత్రాన్ని ఎలా చెక్కనున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం :