ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్”. కన్నడ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో కూడా తెలిసిందే. అయితే ఈ చిత్రానికి గాను సంగీతం అందిస్తున్న రవి బాసృర్ ఈ మధ్యన కన్నడ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో “సలార్” ప్రశాంత్ నీల్ ఆల్రెడీ చేసిన “ఉగ్రమ్” కు రీమేక్ అని రివీల్ చేసేసాడు.
దీనితో ఇది కాస్తా ఓ రీమేక్ సినిమా అని అక్కడ నుంచి ముద్ర పడింది. అయితే అంతకు ముందే ప్రశాంత్ నీల్ ముందు ఈ ప్రశ్నలు వచ్చినా ఇది పూర్తిగా కొత్త కథ అని ఏ సినిమాకు కాపీ కానీ రీమేక్ కానీ కాదని క్లారిటీ ఇచ్చారు. కానీ దాని తర్వాత ఈ చిత్ర సంగీత దర్శకుడే ఇదొక రీమేక్ అని స్టేట్మెంట్ ఇవ్వడంతో దర్శకుడు చెప్పింది నిజమా సినిమాకు పని చేస్తున్న అతను చెప్పింది నిజమా అన్నది ప్రభాస్ అభిమానులను ఇప్పుడు గందరగోళంలో నెట్టింది. దీనితో వారంతా సరైన క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు.


