నాని “శ్యామ్ సింగ రాయ్” ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్!

నాని “శ్యామ్ సింగ రాయ్” ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్!

Published on Feb 21, 2021 7:02 PM IST

nani 1
నాచురల్ స్టార్ నాని హీరోగా ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో తన లారెడీ హిట్ దర్శకుడు శివ నిర్వాణ తో తీస్తున్న “టక్ జగదీష్” ఒకటి కాగా మరొకటి యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్న చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. ఇప్పుడు ఈ రెండు సినిమాల నుంచీ కూడా వరుస అప్డేట్స్ తో నాని మంచి కిక్ ఇస్తున్నాడు.

మరి ఇటీవలే టక్ జగదీష్ టీజర్ పై క్లారిటీ ఇచ్చిన నాని ఇప్పుడు మరి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ శ్యామ్ సింగ రాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ కు కూడా డేట్ ను ప్రకటించేశాడు. ఈ చిత్రం తాలుకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ ఫిబ్రవరి 24న విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. దీనిని నానినే స్వయంగా ప్రకటించాడు. అయితే ఈ చిత్రంలో నాని ఒక డైరెక్టర్ గా కనిపించనున్నాడని తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని నిహారికా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. మరి ఈ సినిమాలో నాని లుక్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు