‘సాయి పల్లవి’ సౌత్ లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది. ఐతే, ఆమె బాలీవుడ్ అరంగేట్రం ఎట్టకేలకు ‘ ఏక్ దిన్ ‘ చిత్రంతో జరిగింది. పైగా అక్కడి స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అన్నిటికీ మించి అమీర్ ఖాన్ స్వయంగా ఈ సినిమాని నిర్మించారు. మొత్తానికి ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఐతే, మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది.
మొదటి రోజే ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వెలవెలబోతోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, మొదటి రోజు దేశవ్యాప్తంగా కేవలం రూ. 1.37 కోట్ల నెట్ వసూళ్లు చేయగా, రెండో రోజు రూ.1 కోటి మాత్రమే రాబట్టింది. మూడో రోజు కలెక్షన్స్ ఇంకా పడిపోయాయి. అటు ఓవర్సీస్‌లో రెండు రోజులకు కలిపి కేవలం రూ. 25 లక్షలు మాత్రమే వచ్చాయట. ఫైనల్ గా ఈ సినిమా ‘డిజాస్టర్’ దిశగా సాగుతోంది. సాయి పల్లవి మొదటి బాలీవుడ్ సినిమా ఈ స్థాయిలో డిజాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.


