బాలీవుడ్ లో సాయి పల్లవి డెబ్యూ సినిమాకి డిజాస్టర్ ఓపెనింగ్స్?

బాలీవుడ్ లో సాయి పల్లవి డెబ్యూ సినిమాకి డిజాస్టర్ ఓపెనింగ్స్?

Published on Apr 30, 2026 6:08 PM IST

ek-din

సౌత్ సినిమా దగ్గర తన మొదటి సినిమా తోనే తెలుగు, మలయాళ ఇండస్ట్రీలో స్టార్ గా మారిన యంగ్ బ్యూటీ సాయి పల్లవి మన దగ్గర వరుస విజయాలు, మినిమమ్ గ్యారెంటీ సినిమాలు చేస్తూ వచ్చింది. ఇక ఇక్కడ నుంచి హిందీ మార్కెట్ లోకి కూడా ఆమె అడుగు పెట్టింది. ఏక్ దిన్ అలాగే రామాయణ లాంటి స్పెషల్ ప్రాజెక్ట్ లతో హిందీ మార్కెట్ లోకి వెళ్లిన సాయి పల్లవి నుంచి ఆమె నటించిన మొదటి చిత్రం ‘ఏక్ దిన్’ ఇప్పుడు హిందీ సహా తెలుగులో విడుదల కాబోతుంది.

అయితే ఈ చిత్రంలో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించగా ఈ మే 1న సినిమా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకి మాత్రం షాకింగ్ వసూళ్లు వచ్చేలా ఉన్నాయని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ చిత్రానికి కేవలం 10 నుంచి 20 లక్షల లోపే నెట్ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది.

మరి ఇదే రీతిలో ఓపెనింగ్స్ వస్తే మాత్రం అది సాయి పల్లవికి డిజాస్టర్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. సినిమాకి ఏమంత పెద్ద బజ్ హిందీలో కనిపించడం లేదు. అమీర్ లాంటి స్టార్ కొడుకు సినిమా అయినప్పటికీ ఆడియెన్స్ లో అంత ఆసక్తి రాలేదు. మరి అల్టిమేట్ గా ఈ సినిమాకి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.

తాజా వార్తలు