సాయి ధరమ్, మారుతి ల మూవీ కి ‘పండగ’లాంటి టైటిల్?

Published on Jun 2, 2019 6:38 pm IST

“చిత్రలహరి” లాంటి క్లాసిక్ మూవీ తరువాత సాయి ధరమ్ డైరెక్టర్ మారుతీ కథను ఒకే చేశాడు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి ఓ ఆసక్తికర టైటిల్ అనుకుంటున్నారని టాలీవుడ్ టాక్. తెలుగు వారికి పెద్ద పండగైన సంక్రాంతి పండుగ మొదటి రోజైన “భోగి” ని టైటిల్ గా పెట్టాలని మారుతి భావిస్తున్నారట. ఎటూ ఈ చిత్రాన్ని సంక్రాతి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నాం కనుక “భోగి” టైటిల్ చక్కగా సరిపోతుందనుకుంటున్నారట. ఐతే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

సాయి ధరమ్ తేజ్ తో ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం పర్ సేల్’ సినిమాలలో నటించిన రెజీనా కాసాండ్రా ను హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట. కామెడీ ఎంటర్టైనింగ్ మూవీస్ తీయడంలో ఎక్స్పర్ట్ అయిన మారుతి, సాయి ధరమ్ తో తెరపై ఎంత హంగామా చేయిస్తాడో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

More