మన టాలీవుడ్ లో అతి పెద్ద ఫిలిం స్టూడియో ఏదన్నా ఉంది అంటే అది అన్నపూర్ణ స్టూడియోస్ అనే చెప్పాలి. లెజెండరీ హీరో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు కట్టించిన ఈ భారీ స్టూడియోలో ఎన్నెన్నో చిత్రాలు ఆద్యం పోసుకున్నాయి. అలాంటి ఎంతో చరిత్ర కలిగిన ఈ స్టూడియోలో నిన్న కొన్ని గంటల కితమే ఓ అగ్నిప్రమాదం జరిగిందన్న వార్త కలకలం రేపింది.
ఇక అసలు వివరాల్లోకి వెళితే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ చిన్న భాగంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అలాగే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు అని అలా అనేక రకాల వార్తలు పెద్దవి చేసి ప్రచారం జరుగుతున్నాయి. దీనితో అన్నపూర్ణ స్టూడియోస్ వారు ఒక క్లారిటీ ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో అంతా బాగానే ఉందని అసలు కన్ఫర్మ్ కానీ వార్తలు ఎవరు నమ్మొద్దని తమ సోషల్ మీడియా ద్వారా విన్నవించారు.
All is well at Annapurna!
.
.
Request to refrain from spreading unconfirmed news????????— Annapurna Studios (@AnnapurnaStdios) October 16, 2020


