ఫుట్ బాల్ స్టేడియం సెట్ కు 6కోట్లు !

Published on Apr 9, 2019 1:11 pm IST

సర్కార్ తరువాత తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం ‘తలపతి 63′(వర్కింగ్ టైటిల్ ) లో నటిస్తున్నాడు. అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇటీవల చెన్నై లో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ 50 రోజుల పాటు జరుగనుంది. ఈషెడ్యూల్ కోసం ఈవీపి స్టూడియోస్ లో 6కోట్ల రూపాయలతో భారీ ఫుట్ బాల్ స్టేడియం సెట్ ను నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను విజయ్ బర్త్ డే (జూన్ 22) రోజు విడుదలచేయనున్నారని సమాచారం.

ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దీపావళికి ఈచిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :