అరవింద సమేతకు సీడెడ్ లో భారీ డిమాండ్ !

Published on Aug 24, 2018 12:02 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద’ సమేత చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ లభించింది. దాంతో ఈ చిత్ర రెండో టీజర్ ను కూడా విడుదలచేసే ప్రయత్నాల్లో ఉన్నారట చిత్ర టీం.

ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కళ్ళు చెదిరే రేంజ్ లో జరుగుతుందట. దాంట్లో భాగంగాసీడెడ్ లో ఈ చిత్రానికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ చిత్రం అక్కడ 15కోట్ల వరకు పలుకుతుందట. ఇప్పటివరకు ఆ ఏరియాలో ఈ రేంజ్ బిసినెస్ చేసిన చిత్రాలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరక్కిస్తున్న ఈచిత్రంలో సునీల్ కమిడియన్ గా నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈచిత్రం దసరా కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :

More