వైజాగ్ ఐనాక్స్ లో సినిమా పడిందట.!

వైజాగ్ ఐనాక్స్ లో సినిమా పడిందట.!

Published on Oct 16, 2020 1:51 PM IST

మన తెలుగు స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే విశాఖ జిల్లా వసూళ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఎంతో అభివృద్ధి చెందిన విశాఖ జిల్లాలో సిటీ, టౌన్ ఇలా ఎన్నో సింగిల్ స్క్రీన్ మరియు ఎన్నో మల్టిపుల్ స్క్రీన్స్ కలిగిన ఐనాక్స్ లు ఉన్నాయి. అయితే లాక్ డౌన్ మూలాన ఎప్పటి నుంచో మూత పడి ఉన్న ఈ థియేటర్స్ అన్లాక్ నిబంధనలతో మొత్తం దేశ వ్యాప్తంగా థియేటర్స్ తెరుచుకోడానికి అనుమతులు ఇచ్చారు.

కానీ తెలుగు రాష్ట్రాలు వారు మాత్రం అందుకు ఆసక్తి చూపలేదు. అయితే విశాఖలోని బీచ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి వరుణ్ ఐనాక్స్ వారు తెరిచారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి సీటింగ్ ను పెట్టి సినిమాను కూడా ప్రదర్శించగా ప్రేక్షకులు కూడా అక్కడ సినిమా వీక్షించినట్టుగా వారు తెలిపారు. అక్కడ ఉన్నటువంటి మొత్తం మూడు స్క్రీన్స్ లో కూడా మ్యాట్నీ మరియు ఫస్ట్ షోలను ప్లాన్ చేసి 50 శాతం ఆడియెన్స్ తో రన్ చేసేందుకు రెడీ చేసారు. అలాగే వైజాగ్ లో బిగ్గెస్ట్ స్క్రీన్ అండ్ సీటింగ్ ఉన్న జగదాంబ థియేటర్ కూడా రేపటి నుంచి తెరుచుకోనున్నట్టు తెలుస్తుంది.

తాజా వార్తలు