‘ది ప్యారడైజ్’లో ఓ మ్యాడ్ యాక్షన్ సీక్వెన్స్..!

‘ది ప్యారడైజ్’లో ఓ మ్యాడ్ యాక్షన్ సీక్వెన్స్..!

Published on Sep 13, 2026 9:01 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న భారీ చిత్రమే ‘ది ప్యారడైజ్’. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా ఒక సాలిడ్ మాస్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రాబోతుంది. అయితే ఈ సినిమాకి ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు వర్క్ చేసిన సంగతి తెలిసిందే.

ఆల్రెడీ టీజర్, ఇతర గ్లింప్స్ లలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మరి వీటిలోని మ్యాడ్ యాక్షన్ సీక్వెన్స్ ఉందని వారు రివీల్ చేశారు. హీరో ఒంటిపై షర్ట్, ప్యాంటు ఏది లేకుండా ఓ ఫైట్ సీన్ ఉందని ఆ సీన్ కోసం హీరో చాలా కష్టపడినట్టుగా వారు తెలిపారు. దీనితో ది ప్యారడైజ్ లో ఈ సీక్వెన్స్ లు మంచి హార్డ్ హిట్టింగ్ గా ఉంటాయని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఈ సెప్టెంబర్ 24న సినిమా గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది.

తాజా వార్తలు