అర్జున్ రెడ్డి డైరెక్టర్ కి బాలీవుడ్ బంపర్ ఆఫర్…!

Published on Jun 29, 2019 11:08 am IST

షాహిద్ కపూర్ హీరోగా మన టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసిన “కబీర్ సింగ్” బ్లాక్ బస్టర్ హిట్ తో ఆయన క్రేజ్ బాలీవుడ్ లో అమాంతంగా పెరిగిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరో లు సైతం సందీప్ రెడ్డి వంగా ఊ..అంటే ఎగబడి సినిమాలు చేయడానికి సిద్ధముగా ఉన్నారు. ‘కబీర్ సింగ్’ మూవీ విషయంలో సందీప్ రెడ్డి టేకింగ్ మరియు దర్శకత్వ ప్రతిభకు బాలీవుడ్ ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు.

ఐతే తాజాగా సందీప్ రెడ్డి వంగా పై బాలీవుడ్లో సంచలన వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది. అదేంటంటే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో ఆయన ఓ చిత్రం చేయనున్నారట. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ టి-సిరీస్ ఈ మూవీ నిర్మించడానికి సన్నాహాలు చేస్తుందట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే అధికారిక ప్రకటన జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ మూవీ కనుక కార్యరూపం దాల్చితే సందీప్ రెడ్డి వంగా స్థాయి మరింత పెరగడం ఖాయం.

కాగా సల్మాన్, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో “ఇన్షాఅల్లా” అనే మూవీ చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అలియా భట్ హీరోయిన్ గా నటించనున్న ఈమూవీ వచ్చే సంవత్సరం రంజాన్ కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సల్మాన్ వంగా కంబినేషన్స్లో తెరకెక్కే మూవీ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More