“మాస్టర్” చిత్రానికి సరికొత్త చిక్కు..?

“మాస్టర్” చిత్రానికి సరికొత్త చిక్కు..?

Published on Jan 5, 2021 12:00 PM IST

Master 4

ఇళయ థలపతి విజయ్ హీరోగా మాళవికా మోహనన్ హీరోయిన్ గా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “మాస్టర్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఓ పాన్ ఇండియన్ సినిమా టైప్ లో విడుదలకు రెడీ అవుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల మేర విడుదలకు సన్నద్ధం అవుతున్న ఈ చిత్రంకు తమిళనాట కొత్త సమస్యలు మళ్ళీ స్టార్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాకు గాను అక్కడి ప్రభుత్వం వారు 100 శాతం ఆక్యుపెన్సీ అనుమతి ఇవ్వడంతో సినీ వర్గాల్లో మరియు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుండగా అక్కడి విపక్షాలు మాత్రం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏకీభవించడం లేదు. దీనితో ఇప్పుడు కోవిడ్ వర్సెస్ కోలీవుడ్ అన్న టైప్ లో వాతావరణం నెలకొంది. అయితే ఇప్పటికే అనుమతులు వచ్చేసాయి కాబట్టి సినిమా అలానే విడుదల కావచ్చు.

దీనితో పాటుగా ఇతర సినిమాలు కూడా అలానే విడుదల అవుతాయని కూడా తెలుస్తుంది. మరి ఈ హై ఎండ్ పొలిటికల్ హీట్ ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించారు. వచ్చే జనవరి 13న ఈ చిత్రం తెలుగులో కూడా గ్రాండ్ గా విడుదల కానుంది.

తాజా వార్తలు