చియాన్ విక్రమ్, రష్యన్ బ్యూటీ అమీ జాక్సన్ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఐ’. సినిమా ప్రారంభం నుండి అనునిత్యం ఏదోక రకంగా రికార్డుల సృష్టిస్తున్న ఈ సినిమా తాజాగా మరొక రికార్డు సృష్టించింది.
ఈ సినిమా ట్రైలర్ కు యుట్యూబ్ లో ఇప్పటివరకు 9 మిలియన్ హిట్స్ లభించాయి. ఒక సౌత్ ఇండియన్ సినిమా ట్రైలర్ ను ఈ స్థాయిలో నెటిజన్లు వీక్షించడం ఇదే తొలిసారి. ట్రైలర్ ఎంత పెద్ద హిట్టయ్యిందో చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ఈ భారి బడ్జెట్ సినిమా విడుదల కొరకు ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎదురు చూస్తున్నాను.
జనవరిలో విడుదలవుతున్న ఈ సినిమా కొత్త ట్రైలర్ ను త్వరలో విడుదల చేయనున్నారు. ఏఅర్ రెహమాన్ సంగీతమందించిన తెలుగు ఆడియో డిసెంబర్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై తెలుగులో ఈ సినిమాను అనువదిస్తున్నారు.


