ఈసారి సూర్య పాత్రకు ఓ ప్రముఖ నటుడు డబ్బింగ్.!

Published on May 22, 2020 2:00 am IST

కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్యకు మన దగ్గర కూడా అశేషమైన ఆదరణ ఉంది. అందులో భాగంగానే తాను నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఆకాశం నీ హద్దురా” తెలుగులో కూడా విడుదలకు సన్నద్ధం అయ్యింది. కానీ అందరికీ తెలిసిన కారణం చేతనే అందాగా ఈ చిత్రం వాయిదా పడాల్సి వచ్చింది.

అయితే ఒకప్పుడు విడుదలయ్యే సూర్య సినిమాలకు డబ్బింగ్ తాను చెప్పకపోయినా పాత్రలను మరియు పరిస్థితులను అనుసరించి కొన్ని చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. అయితే అవి తక్కువే ఉంటాయి.

కానీ ఇప్పుడు విడుదల కానున్న ఆకాశం నీ హద్దురా చిత్రానికి మన టాలీవుడ్ టాలెంటెడ్ యువ నటుడు సత్యదేవ్ డబ్బింగ్ చెబుతున్నట్టు తెలుస్తుంది. సూర్య బాడీ లాంగ్వేజ్ కు కానీ సత్యదేవ్ వాయిస్ మాడ్యులేషన్ కు మ్యాచ్ కుదిరే అవకాశాలు ఉన్నాయి. దర్శకురాలు సుధా కె ప్రసాద్ తెరకెక్కించగా జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More