‘ఫౌజీ’ షూటింగ్ లో గాయపడ్డ ప్రభాస్.. గుర్రపుస్వారీ చేస్తుండగా స్వల్ప గాయాలు..!

‘ఫౌజీ’ షూటింగ్ లో గాయపడ్డ ప్రభాస్.. గుర్రపుస్వారీ చేస్తుండగా స్వల్ప గాయాలు..!

Published on Feb 16, 2026 7:00 AM IST

Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)రీసెంట్ గా ‘రాజా సాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ విడుదల సమయంలో సోషల్ మీడియాలో ఆయనపై కొన్ని ట్రోలింగ్స్ జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కొన్ని పాటలు మరియు యాక్షన్ సన్నివేశాల్లో ‘ఫేస్-స్వాప్’ టెక్నాలజీని వాడారంటూ కొందరు విమర్శలు గుప్పించారు. దీనివల్ల ఆయన అభిమానులు సైతం కొంత నిరాశకు లోనయ్యారు. అయితే, ఆ లోపాలు కేవలం సాంకేతికపరమైనవని లేదా దర్శకుడి నిర్ణయాల వల్ల జరిగినవి కావచ్చని, ప్రభాస్ పడ్డ కష్టాన్ని తక్కువ అంచనా వేయకూడదని మరికొందరు వాదించారు.

కానీ, తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ గుర్రపు స్వారీ చేస్తూ స్వల్పంగా గాయపడ్డారనే వార్త సోషల్ మీడియాలో చర్చను మార్చేసింది. ప్రభాస్ తన సినిమాల కోసం ఎంత శారీరక శ్రమను ఓర్చుకుంటారో ఈ సంఘటన నిరూపిస్తుందని అభిమానులు ఇప్పుడు గట్టిగా సమాధానం ఇస్తున్నారు.

గతంలో ఆయన డెడికేషన్‌ను విమర్శించిన వారికి, ఈ గాయం ఆయన నిబద్ధతకు నిదర్శనమని ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ​ప్రస్తుతానికి ప్రభాస్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని సమాచారం. ఈ చిన్న గాయం నుండి కోలుకుని ఆయన తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నారు. ‘రాజా సాబ్’ ఫలితం తర్వాత సైలెంట్‌గా ఉంటున్న ప్రభాస్, ప్రస్తుతం తన పూర్తి దృష్టిని ‘ఫౌజీ’ మరియు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ చిత్రాలపైనే పెట్టారు..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు