సోనాక్షి సిన్హాతో మురుగదాస్ హిందీ సినిమా!

సోనాక్షి సిన్హాతో మురుగదాస్ హిందీ సినిమా!

Published on Mar 11, 2015 11:16 AM IST

murgudas-and-sonakshi-sinha
కొత్త కథాంశాలనే సున్నితమైన భావోద్వేగాలతో, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించే దర్శకుల్లో ఒకరు.. ఏ. ఆర్. మురుగదాస్. తన కథలతో కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ సినిమాల్లో కూడా తానేంటో నిరూపించుకున్నారు. తమిళంలో ‘కత్తి’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత ఇప్పుడు హిందీలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించనున్నారు. సోనాక్షితో పాటు ఆమె తండ్రి శత్రఘ్న సిన్హా కూడా ఇందులో ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా చెప్పబడుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. తమిళంలో కొంత కాలం క్రితం విడుదలై ఘనవిజయం సాధించిన ‘మౌనగురు’ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం కూడా జరుగుతోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఒక తమిళ సినిమా, ఆ తర్వాత ఒక హిందీ సినిమా ఇలా కెరీర్‌ని సరిగ్గా ప్లాన్ చేసుకొని దూసుకుపోతున్నారు మురుగదాస్.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు