‘A’ రాపిడ్ ట్రైలర్ కు అనూహ్య రెస్పాన్స్!

‘A’ రాపిడ్ ట్రైలర్ కు అనూహ్య రెస్పాన్స్!

Published on Mar 2, 2021 5:00 PM IST

నూతన నటీనటులు నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా యుగంధర్ ముని దర్శకత్వంలో అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన చిత్రం ‘A’. డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ప్రోమోస్ అన్నీ ఇటీవల కాలంలో మంచి అటెన్షన్ ను తెచ్చుకున్నాయి. అలాగే కొన్ని రోజుల కితమే ఈ చిత్ర ట్రైలర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేశారు.

ఈ ట్రైలర్‌ అనూహ్య రెస్పాన్స్ రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. అలాగే చిత్రంలోని కొంత భాగాన్ని చూసిన విజయ్ సేతుపతి.. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని చిత్రయూనిట్‌కు అభినందనలు తెలపడం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రాపిడ్ కట్ ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. మరి దీనిని చూసినట్లయితే..

‘‘యుద్ధానికి కావాల్సింది గమ్యం.. అది తిరిగిరాలేనిదైనా నాకు సంతోషమే..’’ అంటూ ఇంటెన్స్ డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్.. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. అంతేకాదు సినిమా ఏ రేంజ్‌లో తెరకెక్కిందో తెలిపేలా ఉంది. విభిన్న చిత్రాలను కోరుకుంటున్న ప్రేక్షకులకు ఈ చిత్రం ఫుల్ మీల్స్ ఇవ్వబోతుంది అనేలా ఈ రాపిడ్ ట్రైలర్‌ను కట్ చేశారు.

ట్రైలర్ చూసిన ఎవరైనా..మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ వస్తుంది అనుకుంటారు.ఈ మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని PVR పిక్చర్స్ వారు గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. విజయ్ కురాకుల సంగీతం అందించగా అనంత్ శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.

ఇక ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ డిజైన్: బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ మిక్సింగ్: సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్), ఎడిటింగ్: ఆనంద్ పవన్, మ‌ణి కందన్ (ఎఫ్‌టిఐఐ), సంగీతం: విజయ్ కురాకుల, నిర్మాత: గీతా మిన్సాల, దర్శకత్వం: యుగంధర్ ముని లు అందిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు