ఓవర్సీస్ లో ‘టాక్సిక్’కి రికార్డు మొత్తంతో డీల్ పూర్తి చేసారా!?

ఓవర్సీస్ లో ‘టాక్సిక్’కి రికార్డు మొత్తంతో డీల్ పూర్తి చేసారా!?

Published on Feb 11, 2026 2:00 AM IST

Toxic

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా కియారా అద్వానీ అలాగే హుమా ఖురేషి, నయనతార, తారా సుతారియా లాంటి హీరోయిన్స్ కలయికలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రమే ‘టాక్సిక్’. పాన్ ఇండియానే కాకుండా పాన్ వరల్డ్ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా బిజినెస్ ఇప్పుడిప్పుడే పూర్తి చేసుకుంటుంది.

ఆల్రెడీ తెలుగులో దిల్ రాజు ఈ సినిమాని సొంతం చేసుకోగా లేటెస్ట్ గానే ఓవర్సీస్ డీల్ ని ఫార్స్ సంస్థ సొంతం చేసుకున్నారు. అయితే ఈ డీల్ కోసం వారు భారీ మొత్తమే ఇచ్చినట్టు సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. వీరు ఇంగ్లీష్ మినహా మిగతా భాషల్లో హక్కులు సొంతం చేసుకున్నారు.

ఇలా పాన్ ఇండియా భాషల మొత్తం అంతటికి 105 కోట్లు వెచ్చించినట్టు తెలుస్తుంది. ఇది కన్నడ సినిమాలలో బిగ్గెస్ట్ రికార్డు. అలాగే దక్షిణాది సినిమా నుంచి కూడా ఓవర్సీస్ మార్కెట్ లో ఈ రేటు పలకడం చాలా అరుదు. సో భారీ టార్గెట్ తోనే టాక్సిక్ దిగబోతుంది అని చెప్పవచ్చు. మరి ఈ అంచనాలు అందుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే ఈ మార్చ్ 19 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు