ఎన్టీఆర్ సినిమా కోసం లండన్‌లో సెట్!

ఎన్టీఆర్ సినిమా కోసం లండన్‌లో సెట్!

Published on Aug 30, 2015 11:02 AM IST

ntr-new-still
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ప్రస్తుతం ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. సుకుమార్ అంటే డీటైలింగ్‌కు, స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌కు పెట్టింది పేరు. ఇక మాస్‌, యూత్‌లో ఫుల్ ఫాలోయింగ్‌తో పాటు నటన పరంగా ది బెస్ట్ అనిపించుకున్న హీరో ఎన్టీఆర్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే దానిపై ఏ స్థాయి అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకు తగ్గట్టుగానే దర్శక నిర్మాతలు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక గత కొద్దికాలం క్రితం లండన్‌లో పెద్ద ఎత్తున మొదలైన షెడ్యూల్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ షెడ్యూల్‌ విషయమై ప్రస్తుతం ఒక ఆసక్తికర విషయం తెలుస్తోంది. ఫారిన్ షెడ్యూల్స్‌లో సెట్స్ లాంటివి వేయడం తక్కువగా జరగడం తెలిసిందే. ఈ సినిమా కోసం లండన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న జగపతి బాబు ఆఫీసు కోసం 60 లక్షలకు పైనే విలువ చేసే సెట్ వేశారట. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ సెట్‌కు రూపకల్పన చేశారు. సాధారణంగా సెట్స్‌లోనే తీసే సన్నివేశాలకైతే ఇక్కడే అలాంటి ఏర్పాట్లు చేస్తుంటామని, సుకుమార్ పర్‌ఫెక్షన్ కోసం లండన్‌లోనే ఆఫీస్ ఎలా ఉండాలి అనే దానిప్రకారం సెట్ వేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా బీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు