కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నయనతార, కియార అద్వానీ అలాగే హుమా ఖురేషి లు ఫీమేల్ లీడ్స్ లో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం టాక్సిక్ కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తెలుగు రిలీజ్ పై నేడే బిగ్ అప్డేట్ కూడా ఒకటి బయటకు వచ్చింది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ సినిమాని తెలుగు స్టేట్స్ లో రిలీజ్ కి తీసుకొస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
అయితే తెలుగు హక్కులకు గాను ఓ షాకింగ్ ఫిగర్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీనితో కేవలం తెలుగు స్టేట్స్ లోనే ఈ సినిమా ఏకంగా 120 కోట్ల బిజినెస్ చేసినట్టు ఓ లెక్క వైరల్ అవుతుంది. కానీ ఇది ఫేక్ అని మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు స్టార్స్ సినిమాలకే పెట్టడం లేదు.
అలాంటిది ఎంత అంచనాలు ఉన్నా ఒక డబ్బింగ్ సినిమాకి ఈ రేంజ్ లో నమ్మశక్యం కానీ పని. అయితే ఈ సినిమాకి కేవలం 45 కోట్ల మేర బిజినెస్ మాత్రమే జరిగినట్టు సోషల్ మీడియాలో మరో ప్రచారం జరుగుతోంది. సో ఆ 120 కోట్ల మాట ఏమో కానీ ఈ 40 కోట్ల మార్క్ నిజమైతే దాన్ని అందుకోడానికి టాక్సిక్ కి ఛాన్స్ ఉంది.


