ప్రస్తుతం ప్రపంచ ఆడియెన్స్ ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రమే “అవతార్ ఫైర్ అండ్ యాష్”. లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఈ విజువల్ ట్రీట్ లోని మూడో భాగం ఇంకొన్ని రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ని పలకరిస్తుంది. కానీ ఈ ముందే ఆల్రెడీ అవతార్ 3 రివ్యూస్ మొదలయ్యాయి. హాలీవుడ్ కి చెందిన ప్రముఖ సంస్థల నుంచి అవతార్ 3 రివ్యూస్ వచ్చేసాయి. అయితే ఒకింత ఇవి షాకింగ్ గానే ఉన్నాయని చెప్పాలి.
ఈసారి కూడా యాక్షన్ అండ్ టేకింగ్ ఎక్సలెంట్ గా కుదిరాయి అని కానీ గత సినిమా లానే సరైన డెప్త్ ఉన్న కథ ఇందులో లేదని రోటెన్ టొమాటోస్, ఐ జి ఎన్ ఇంకా తదితర పాపులర్ సినిమా సంబంధించిన సంస్థలు చెబుతున్నాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ గా అవతార్ 1, 2 లకి వరుసగా తగ్గిన రేటింగ్ దీనికి కూడా తగ్గుతూనే వచ్చింది. సో ఈసారి పార్ట్ 3 కి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

