“వీరమల్లు” నుంచి లీక్..పవన్ తో గట్టిగా ప్లాన్ చేసిన క్రిష్.!

Published on Jun 28, 2021 12:02 am IST

ఇటీవల మన టాలీవుడ్ లో భారీ చిత్రాలు షూటింగ్ లో ఉండగానే ఎన్నో లీక్స్ బయటకి వచ్చేస్తున్నాయి. ఆల్ మోస్ట్ టాలీవుడ్ నుంచి సిద్ధమవుతున్న పాన్ ఇండియన్ సినిమాలు అన్నీ కూడా లీక్స్ బారిన పడ్డాయి. అయితే అవన్నీ ఆన్ లొకేషన్ స్టిల్స్ కానీ చిన్నపాటి వీడియోస్ మాత్రమే. మరి ఇప్పుడు ఈ లిస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “హరిహర వీరమల్లు” కూడా యాడ్ అయ్యింది.

అయితే ఇది వరకు చిన్న చిన్న ఫొటోస్ బయటకి వచ్చినా ఈసారి ఏకంగా వీడియోనే బయటకి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో ఓ శాలి యాక్షన్ సీక్వెన్స్ కోసం తెలంగాణాకి చెందిన పలువురు మల్ల యోధులను ఈ షూట్ నిమిత్తం పిలిచారు. మరి వారికి పవన్ నడుమ ఉండే యాక్షన్ సీక్వెన్స్ నే లీక్ అయ్యినట్టు తెలుస్తుంది.

దీనితో అది చూసిన పలువురు పవన్ అభిమానులు దర్శకుడు క్రిష్ పవన్ తో ఏదో గట్టిగానే ప్లాన్ చేసారని అనుకుంటుండగా మరికొందరు ఇలా లీక్స్ పై ప్రొడక్షన్ హౌస్ వారు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో యాక్షన్ కానీ విజువల్స్ కానీ మరో స్థాయిలో క్రిష్ ప్లాన్ చేస్తున్నారని తెలిసిందే. వాటిలో ఇదొక శాంపిల్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :