“పుష్ప” నుంచి సాలిడ్ అప్డేట్ రాబోతోందా.?

Published on Jun 29, 2021 10:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చనున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. మరి అలాగే పాన్ ఇండియన్ లెవెల్లో మంచి హైప్ ను పెంచుకుంటూ వెళ్తున్న ఈ చిత్రం షూటింగ్ కూడా ఆల్ మోస్ట్ పూర్తి కానుంది.

అయితే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ షూట్ లో ఉన్న ఈ ఇంటెన్స్ మాస్ యాక్షన్ డ్రామా నుంచి సాలిడ్ అప్డేట్ సిద్ధం అవుతున్నట్టు టాక్. మామూలుగానే బన్నీ – సుకుమార్ – దేవి కాంబో అంటే ఆ ఆల్బమ్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. పైగా ఇది హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ ఆల్బమ్ పై కూడా మరోస్థాయి అంచనాలు ఉన్నాయి.

మరి ఎట్టకేలకు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ లాంచ్ కు సమయం దగ్గర పడినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా డేట్ సమయం ఎప్పుడో తెలియరాలేదు కానీ ఫస్ట్ సింగిల్ అయితే త్వరలోనే అట.. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. అలాగే ఈ చిత్రంలో మళయాళ నటుడు ఫహద్ విలన్ రోల్ లో నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :