“వీరమల్లు”లో ఓ అదిరే సూపర్ స్టంట్ పై క్రిష్.!

Published on Mar 30, 2021 11:01 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” ట్రైలర్ యుఫోరియా ఇప్పుడు నడుస్తుంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ కం బ్యాక్ చిత్రం కోసం పవన్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో ప్లాన్ చేసిన భారీ పాన్ ఇండియన్ పీరియాడిక్ చిత్రం “హరి హర వీరమల్లు” కోసం కూడా ఎదురు చూస్తున్నారు.

ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ వీడియోకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమాలో పలు అదిరే యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఉన్నాయని విన్నాము. ఇప్పుడు క్రిష్ ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ కౌషల్ పవర్ స్టార్ కోసం ఒక హై అండ్ సూపర్ స్టంట్ చేసారని తెలిపారు.

ఇండియన్ సినిమాలోనే పేరొందిన ఈ ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ ఈ చిత్రం షూట్ పై తన అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా క్రిష్ ఈ విషయాన్ని వెల్లడించారు. భారీ యాక్షన్ చిత్రాలు “ధూమ్ 3”, “క్రిష్ 3” అలాగే అనేక పీరియాడిక్ సినిమాలకు స్టంట్ కొరియోగ్రఫీ చేసిన ఈయన వీరమల్లు లో ఎలాంటి సీక్వెన్స్ లు చేసారో తెలియాలి అంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :