అల వైకుంఠపురంలో నుండి మీరు చూడని సన్నివేశం

Published on Mar 16, 2020 3:03 pm IST

అల వైకుంఠపురంలో మూవీ అల్లు అర్జున్ కి భారీ హిట్ కట్టబెట్టింది . ఈ చిత్రంతో ఆయన ఓ ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రం టాలీవుడ్ టాప్ హైయెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రాలలో మూడవ స్థానం ఆక్రమించింది. ప్రస్తుతం చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డ్స్ బన్నీవే. ఈ మూవీ విడుదలై 50 రోజులు దాటిపోయినది. కాగా మూవీలోని వీడియో సాంగ్స్ విడుదల చేసిన చిత్ర బృందం నేడు ఓ సర్ప్రైజింగ్ వీడియో విడుదల చేయనున్నారట.

అల వైకుంఠపురంలో చిత్రంలోని ఓ డిలీట్ చేయబడిన సన్నివేశం నేడు సాయంత్రం 4:05 కి విడుదల చేయనున్నారు. ఈ సన్నివేశం బన్నీ మరియు సుశాంత్ పై తెరకెక్కినదిగా తెలుస్తుంది. సినిమా విడుదలై ఇన్ని రోజులవుతున్నా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అల వైకుంఠపురంలో మూవీ ఫ్యాన్స్ కి చిత్ర యూనిట్ సరదా పంచుతున్నారు. ఇక ప్రస్తుతం బన్నీ సుకుమార్ మూవీ కోసం సిద్ధం అవుతున్నారు. త్వరలో ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ మొదలుకానుంది.

సంబంధిత సమాచారం :

More