అవైటెడ్ “లవ్ స్టోరీ” రిలీజ్ పై టెన్షన్ టెన్షన్..!

Published on Sep 4, 2021 1:00 pm IST

టాలీవుడ్ ఆడియెన్స్ ఎప్పుడు నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పలు చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా “లవ్ స్టోరీ” కూడా ఒకటి. అక్కినేని యువ హీరో నాగ చైతన్య హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం నిజానికి ఈ నెల 10న వినాయక చవితి కానుకగా థియేట్రికల్ రిలీజ్ కి ఫిక్స్ అయ్యింది.

అయితే ఈ చిత్రం విడుదల పై అనుమానాలు మళ్ళీ మొదటికే వచ్చాయి అప్పుడు అంటే ప్యాండమిక్ మూలాన వాయిదా పడింది కానీ ఇప్పుడు పెంచని టికెట్ ధరలు అదనపు భారంగా పడినట్టు తెలుస్తుంది. ఇంకా ఏపీలో టికెట్ ధరలపై తుది క్లారిటీ రాకపోవడం అలాగే 10న మరిన్ని కీలక సినిమాలు ఉండడంతో ఈ సినిమా వాయిదా కన్ఫర్మ్ అయ్యింది అని టాక్ ఉంది.

కానీ ముఖ్యంగా టికెట్ ధరల విషయంలో మేకర్స్ కి ఇబ్బందులు తప్పడం లేదని అందుకే బహుశా లాస్ట్ ఆప్షన్ గా ఈ చిత్రానికి కూడా ఓటిటి రిలీజ్ నే ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనితో ఈ సినిమా విషయంలో మరింత టెన్షన్ నెలకొంది. అయితే ఇంకా ఇందులో ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు కానీ టాక్ వైరల్ అవుతుంది. మరి దీనిపై తుది క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :