రజినీ సినిమా నుంచి ఇది ప్రత్యేక ఊహించని ట్రీట్ నే మరి..!

Published on Oct 2, 2021 7:01 am IST


వన్ అండ్ ఓన్లీ పాన్ ఇండియన్ సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “అన్నాత్తే”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి మొన్న రజిని బర్త్ డే కానుకగా వచ్చిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ టీజర్లకు భారీ రెస్పాన్స్ వచ్చాయి. మరి ఇప్పుడు మరో స్పెషల్ అప్డేట్ ఈ సినిమా నుంచి రావడం కన్ఫర్మ్ అయ్యింది. అదే ఈ సినిమా ఫస్ట్ సింగిల్.. అన్ని సినిమాలకు ఫస్ట్ సాంగ్స్ రిలీజ్ అవుతాయి ఇందులో ఏముంది అంటే..

ఉంది. ఇదే రజిని మరియు భారతీయ లెజెండరీ గాయకులు ఎస్ పి బాలు గారి కాంబోలో వచ్చే లాస్ట్ సాంగ్. తలైవర్ సినిమాలు అంటే దాదాపు బాలు గారితోనే ఇంట్రో సాంగ్ ఖాయం అలానే ఈ సినిమాకి కూడా వారి గాత్రంతో రికార్డ్ చేసిన ఈ సాంగ్ ని మేకర్స్ వచ్చే ఆక్టోబర్ 4 న రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ చేశారు. ఇమన్ మంచి మాస్ బీట్స్ ఇవ్వడంలో ముందుంటాడు ఇక ఈ స్పెషల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :