Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
‘అఅఆ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ రోజే !
Published on Nov 6, 2018 4:07 am IST

మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’ విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రానికి సంభందించిన ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు చిత్ర యూనిట్. దాంట్లో భాగంగా ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను ఈనెల 10న హైదరాబాద్లో ఘనంగా నిర్వహించనున్నారు.

శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ చిత్రంలో రవితేజ కు జోడిగా ఇలియానా నటించింది. ఈ చిత్రం తో ఆమె చాలారోజుల తరువాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 16న విడుదల కానుంది. ఇక ఈచిత్రం విజయం సాధించడం రవితేజ , శ్రీను వైట్ల కు చాలా అవసరం. కాగా రవితేజ తో శ్రీను వైట్ల కు ఇది నాల్గవ సినిమా ఇంతకుముందు వీరిద్దరి కలయికలో ‘నీకోసం, వెంకీ , దుబాయ్ శీను’ వంటి చిత్రాలు తెరకెక్కాయి.

సంబంధిత సమాచారం :