“ఆడవాళ్ళు మీకు జోహార్లు” షూటింగ్ షురూ చేసిన టీమ్!

Published on Jul 20, 2021 11:34 am IST

డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈ చిత్రం లో శర్వానంద్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ లు గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శర్వానంద్ పుట్టిన రోజు న టైటిల్ ను అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా చిత్ర షూటింగ్ ను షురూ చేసింది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకం పై చిత్రం తెరకెక్కుతుంది. అయితే నేటి నుండి ఈ చిత్రం షూటింగ్ మొదలు కావడం తో నటీనటులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే శర్వానంద్ ఇప్పటికే మహా సముద్రం, ఒకే ఒక జీవితం చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే ఆ చిత్రాలు చేస్తూనే ఇందులో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సుజిత్ సరంగ్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. రెడ్ సినిమా తర్వాత కిశోర్ తిరుమల చేస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.

సంబంధిత సమాచారం :