ఇంటర్వ్యూ : ఆది పినిశెట్టి – నేను డబ్బులు కోసం సినిమాలు చెయ్యను !

ఇంటర్వ్యూ : ఆది పినిశెట్టి – నేను డబ్బులు కోసం సినిమాలు చెయ్యను !

Published on Aug 23, 2018 6:00 PM IST

ఆది పినిశెట్టి హీరోగా, తాప్సీ పన్ను, రితికా సింగ్‌ ముఖ్య పాత్రల్లో రాబోతున్న థ్రిల్లర్‌ చిత్రం నీవెవరో. రంగస్థలం తర్వాత ఆది నటిస్తోన్న చిత్రం కావటంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ట్రైలర్ లతో ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం మంచి బజ్ సృష్టించుకుంది. కాగా ఆగష్టు 24న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర హీరో ఆది పినిశెట్టి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం..

ఈ చిత్రానికి ‘నీవెవరో’ అని టైటిల్ పెట్టడానికి గల కారణం ?
‘నీవెవరో’ అని సినిమాలోని క్యారెక్టర్స్ ను క్వశ్చన్ చేస్తున్నామండి. అంటే ప్రతి మనిషి బయట ఉండేది ఒకటి. లోపల ఉండేది ఒక్కటి. సింపుల్ గా చెప్పుకుంటే ‘నీవెవరో’ అనేది లోపల ఉన్న మనిషి ఎవరు అని చెప్పే కథ. పూర్తిగా స్క్రిప్ట్ కి సంబంధిచిన టైటిల్ ఇది. వెరీ వెరీ ప్రాక్టికల్ ఫిల్మ్, ఇప్పుడున్న సమాజంలో ఏమి జరుగుందో వాట్ని బేస్ చేసుకుని ఈ సినిమా చేశాము.

మీరు మొదటిసారి బ్లైండ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ లో యాక్ట్ చేసేటప్పుడు చాలెంజింగ్ గా అనిపించిందా ?
చాలా చాలా చాలెంజింగా అనిపించింది. ఈ సినిమా నేను చేస్తున్నాను అని డిసైడ్ అయ్యాక, షూటింగ్ కి వన్ మంత్ గ్యాప్ ఉంది. ఆ టైం అంతా ఈ క్యారెక్టర్ గురించే ఆలోచిస్తుంటేనే చాలా కష్టం అనిపించేది. అంటే ఒక మామూలు క్యారెక్టర్ చేసేటప్పుడు ఎలాగైనా చేసేయొచ్చు అండి. ఇలాగే చేయాలి అని ఏమి ఉండదు. కానీ బ్లైండ్ క్యారెక్టర్ చేసేటప్పుడు ఇలానే చెయ్యాలి అని కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆడియన్స్ ని వీడు నిజంగానే బ్లైండ్ అని నమ్మించాలి, నిజంగా ఇది ఛాలెంజింగ్ క్యారెక్టరే.

మరి ఈ ఛాలెంజింగ్ క్యారెక్టర్ చెయ్యటానికి ఎలాంటి హార్డవర్క్ చేశారు ?
నేను ఓ నాలుగు వారాలు పాటు ఎవరీ సండే చెన్నైలోని బ్లైండ్ స్కూల్ కి వెళ్ళాను. వాళ్ళు ఎక్స్ ప్రెషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ రియాక్షన్స్ ఇలా అక్కడ చాలా థింగ్స్ అబ్జర్వ్ చేశాను. మెయిన్ గా బ్లైండ్ లో కూడా చాలా రకాలు ఉంటాయి అండి. ఈ సినిమాలో నా పాత్ర కళ్యాణ్ కి పదిహేను సంవత్సరాల ఏజ్ లో కళ్ళు పొయ్యాయి. అతను ఎంత సన్ లైట్ లోకి వెళ్లిన కూడా, అతనికి లైట్ అనేది లోపలికి వెళ్ళదు. పూర్తిగా తను బ్లైండ్. అందుకే ఈ సినిమాలో ఎక్కడ తను కళ్ళజోడు కూడా పెట్టుకోడు.

తెలుగులో చాలా రోజులు తర్వాత మీరు మెయిన్ హీరోగా సినిమా చేశారు ?ఎందుకు ఇంత ఆలస్యం అయింది ? హీరోగా ఛాన్స్ లు రాలేదా ?
లేదండి. చాలా సినిమాలు వస్తున్నాయి. కానీ నాకు కొంచెం లైట్ గా తిక్క ఉంది. అంటే నేను చేయబోయే సినిమా స్క్రిప్ట్ నాకు బాగా నచ్చాలి. రెండోది డైరెక్టర్ మీద పూర్తిగా నమ్మకం కుదరాలి. వీటితో పాటు ఆ సినిమాని జనంలోకి తీసుకువెళ్లగలిగే మంచి ప్రొడక్షన్ హౌస్ ఉండాలి. ఇవ్వన్ని దృష్టిలో పెట్టుకొనే నేను సినిమాలు చేయాలనుకుంటున్నాను. అందుకే ఆలస్యం అవుతుంది.

నీవెవరో సినిమా రేపు విడుదలవుతుంది. మరి మీరు సినిమా చూశారా ? చూశాక మీకేమనిపించింది ?
సినిమా చూసాను, కానీ నన్ను నేను జడ్జ్ చేసుకోలేనండి. అందుకే షూట్ చేస్తున్నప్పుడే తాప్సిని అడిగేవాడ్ని. కొనగారిని అడిగేవాడ్ని అసలు నేను బ్లైండ్ గా ఉన్నానా ? సీన్ కన్విన్స్ అవుతుందా ? అని ఇలా చాలా డౌట్స్ ఉండేవి. ఇవ్వన్నీ రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యాక, నా డౌట్స్ అన్ని పోతాయి.

మీరు ‘వైరల్ ధనుష్’ లాంటి పవర్ ఫుల్ విలన్ పాత్ర చేశారు. మళ్ళీ అలాంటి స్ట్రాంగ్ విలన్ పాత్రలు మీకు రాలేదా ?
చాలా వచ్చాయండి. సింగం లాంటి సినిమాల్లో, పెద్ద పెద్ద స్టార్స్ సినిమాల్లో మెయిన్ విలన్ రోల్స్ వచ్చాయి. నాకే చేయాలనీ అనిపించలేదు. నేను చేసిన పాత్రనే మళ్ళీ నేనే చెయ్యటం నాకు అసలు ఇష్టం లేదు. బేసిగ్గా నేను డబ్బులు కోసం సినిమాలు చెయ్యను. దేవుడి దయ వల్ల నాకు ఆ అవసరం లేదు.

మీరు ఆర్ ఎక్స్ 100 సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమానే రీమేక్ చెయ్యడానికి కారణం ?
ఆ సినిమా రీమేక్ చేస్తున్నామని తెలియకముందే ఆ సినిమా చూసాను నాకు బాగా నచ్చింది. నిజంగా ఆ సినిమాలో కంటెంట్ తో పాటు, హీరో హీరోయిన్స్ కూడా చాలా నిజాయితీగా నటించారు. నేను ఆ సినిమా షూట్ కి వెళ్లబోయేముందే సాధ్యమైనంతవరికి ఆ సినిమా మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను.

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాని తమిళంలో ఎవరు డైరెక్ట్ చేయనున్నారు ?
ఇంకా ఫైనల్ కాలేదండి. ప్రస్తుతం వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఆ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు