స్పోర్ట్స్ డ్రామా కోసం ఫుల్ కసరత్తులు చేస్తోన్న యంగ్ హీరో !

స్పోర్ట్స్ డ్రామా కోసం ఫుల్ కసరత్తులు చేస్తోన్న యంగ్ హీరో !

Published on Jun 28, 2019 7:00 AM IST

వైవిధ్య‌మైన క‌థ‌లు, పాత్ర‌ల‌తో మెప్పిస్తూ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యువ న‌టుడు ఆది పినిశెట్టి. కాగా ఆది ప్రస్తుతం ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. జూన్ 12 నుండి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొదలైంది. ఈ మొదటి షెడ్యూల్ ఈ నెల చివరి వరకూ జరగనుంది. కాగా షూట్ కోసం ఆది ఫుల్ గా కఠినమైన కసరత్తులు చేస్తోన్నాడట.

ఇక ప్రిత్వి ఆదిత్య ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ సినిమా పక్కా స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌లో తెర‌కెక్క‌నుంది. ఓ యువ‌కుడు అథ్లెట్‌ గా మారే క్ర‌మంలో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఫేస్ చేశాడు. వాటిని ఎలా అధిగ‌మించి ఉన్న‌త‌స్థాయికి చేరుకున్నాడ‌నేదే ప్ర‌ధాన క‌థాంశం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రానున్న ఈ చిత్రాన్ని ఐబీ కార్తికేయ‌న్ నిర్మిస్తున్నారు. బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్ సంస్థ రూపొందిస్తోంది. ప్ర‌వీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు