కుమార్ బాబు గా కనిపించబోతున్న ఆది !

కుమార్ బాబు గా కనిపించబోతున్న ఆది !

Published on Mar 12, 2018 1:44 PM IST

‘రంగస్థలం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 18 న వైజాగ్ లో గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి ఆది పినిశెట్టి లుక్ బయటకు రావడం జరిగింది. కుమార్ బాబు ఈ సినిమాలో ఆది పాత్ర పేరు.

సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అనసూయ ప్రధాన పాత్రల్లో కనిపించబోతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లోకల్ పాలిటిక్స్ ఉండబోతున్నట్లు సమాచారం. బయటికి వచ్చిన పోస్టర్ చూస్తుంటే ఆది పినిశెట్టి ఈ సినిమాలో గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటి చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు