యంగ్ హీరో ఆది నటించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘గాలిపటం’. ఈ సినిమా ఆగష్టు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు ‘గాలిపటం’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు.
గాలిపటం సినిమా రెగ్యులర్ టాలీవుడ్ ఎంటర్టైనర్ కాదని, ఇలాంటి సినిమా సౌత్ లో రావడం ఇదే ప్రధమం అని హీరో ఆది అంటున్నాడు. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా సంపత్ నంది అసిస్టెంట్ నవీన్ గాంధీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డైరెక్టర్ నుంచి నిర్మాతగా అవతారం ఎత్తిన సంపత్ నంది కూడా సినిమా విజయంపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఆదితో పాటు రాహుల్ రవీంద్రన్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో రష్యన్ మోడల్ క్రిస్టిన అఖీవ, ఎరికా ఫెర్నాండెజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భీమ్స్ సెసిర్లో సంగీతం అందించాడు.


