విడుదల తేదీ : డిసెంబర్ 25, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : ఆది, అర్చన అయ్యర్, శ్వసిక, మధునందన్, రవి వర్మ, మీసాల లక్ష్మణ్ తదితరులు
దర్శకుడు : యుగంధర్ ముని
నిర్మాతలు : మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు
సినిమాటోగ్రాఫర్ : ప్రవీణ్ కె బంగారి
సంగీత దర్శకుడు : శ్రీచరణ్ పాకాల
ఎడిటర్ : శ్రవణ్ కటికనేని
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లో మంచి బజ్ తో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఆది సాయి కుమార్ నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “శంబాల” కూడా ఒకటి. మరి ఈ చిత్రం అంచనాలు అందుకుందా లేదా ఆది కోరుకుంటున్న హిట్ దొరికిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం రండి.
కథ:
అది 1980వ దశకం, శంబాల అనే ఒక చిన్న ఊరిలో ఆకస్మికంగా ఒక భారీ ఉల్క పడుతుంది. సరిగ్గా అది పడిన తర్వాత నుంచి ఆ ఊరిలో కొన్ని ఊహించని ఘటనలు మొదలవుతాయి. ఒకరి తర్వాత ఒకరు తమ మెడ వెనుక ఒక బొడుపిలా వచ్చి తర్వాత అది విచ్చిన్నం అయ్యి చనిపోతూ ఉంటారు. అయితే ఆ ఉల్క ఏంటి అని పరిశోధించడానికి వచ్చిన ప్రభుత్వ జియో సైంటిస్ట్ పైగా నాస్తికుడు, విక్రమ్ (ఆది) ఆ ఊరి సమస్య మధ్యలోకి వెళ్తాడు. అక్కడ నుంచి శాస్త్రానికి, సైన్స్ కి మధ్య వార్ ఎలా నడిచింది? అసలు ఆ ఊరికి ఏమైంది? ఆ ఉల్క వెనుక ఉంది సైన్సా? లేక శాస్త్రమా? ఆ ఊరిలో చావులు ఆగయా లేదా? ఆదికి మాత్రమే కనిపించే దేవి (అర్చన అయ్యర్) ఎవరు? విక్రమ్ చేసింది ఏంటి? అనేవి తెలియాలి అంటే ఈ సినిమాని చూడాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రంలో దర్శకుడు ఎంచుకున్న కోర్ పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. ఈ మధ్య కాలంలో వస్తున్న డివోషనల్ అండ్ సైన్స్ మిక్స్డ్ సబ్జెక్టు లలో ఇది మరో కొత్త ప్రయత్నం అని చెప్పొచ్చు. ఇందులో సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో చెప్పించిన బ్యాక్ స్టోరీ కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా ఆడియెన్స్ కి ఒక కొత్త సమాచారాన్ని అందించినట్టు అనిపిస్తుంది.
ఇందులో డివోషన్ అంశాలని, ప్రస్తుత వాస్తు సంబంధించిన అంశాలు అర్ధం అయ్యేలా చెప్పడం డీసెంట్ గా అనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ లో ఒక సమయం తర్వాత కొన్ని పరిస్థితులు ఆడియెన్స్ కి ముందే అర్ధం అయినప్పటికీ అక్కడ వచ్చిన కొన్ని డివోషనల్ మూమెంట్స్ ఇంప్రెస్ చేసే విధంగా ఉన్నాయి. వీటితో పాటుగా కొన్ని సీన్స్ లో మైంటైన్ చేసిన థ్రిల్ అంశాలు కూడా బాగున్నాయి.
ఇక నటీనటుల్లో ఆది సాయి కుమార్ మంచి పెర్ఫామెన్స్ ని అందించాడు. మెయిన్ గా తన స్క్రిప్ట్ సెలక్షన్ కి ఇంకొంచెం ఎక్కువ మార్కులు ఇవ్వొచ్చు. ఈ సినిమా కోసం తన లుక్ కరెక్ట్ గా సెట్ అయ్యి విక్రమ్ అనే పాత్రలో మంచి నటన తాను కనబరిచాడు. ఇక తనతో పాటుగా అర్చన అయ్యర్ కి కూడా మంచి రోల్ దక్కింది. దేవి పాత్రలో ఆమె తన ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది. అలాగే నటుడు మధునందన్, హర్ష వర్ధన్ డీసెంట్ నటన అందిస్తే రవి వర్మ అలాగే నటుడు లక్ష్మణ్ మీసాలలు తమ పెర్ఫామెన్స్ లతో సర్ప్రైజ్ చేశారు. వీరితో పాటుగా ఇతర ప్రధాన తారాగణం బాగా చేశారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో మెయిన్ ప్రాబ్లెమ్ మాత్రం కథనంలో కొంచెం లోపమే అని చెప్పాలి. ఫస్టాఫ్ ఇంకా సెకండాఫ్ లో చాలా వరకు సీన్స్ ఊహాజనితంగా కొనసాగుతాయి. సో ఒక మూమెంటం తర్వాత అంత ఇంట్రెస్టింగ్ గా సినిమా వెళుతున్నట్టు అనిపించదు. హీరోయిన్, ఇంకా ఆ ఊరిలో జరిగే చావులు లాంటివి చాలా రెగ్యులర్ ఫార్మాట్ లో అనిపిస్తాయి.
వీటిని దర్శకుడు ఇంకొంచెం కొత్తగా ఏమన్నా ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేది. అంతే కాకుండా సైన్స్ కి శాస్త్రానికి నడుమ ఘర్షణ సన్నివేశాలు లాంటివి ఇంకొంచెం జోడించి ఉండాల్సింది. అలాగే సినిమాలో చూపించిన ఏఐ విజువల్ ట్రాక్ కూడా అంత నాచురల్ గానూ లేదు బాగోలేదు అని చెప్పడానికి లేదు. దీని బదులు కరెక్ట్ గా యానిమేషన్ లోనే చేసుకొని ఉంటే బాగుండేది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. సినిమా సెటప్, ప్రొడక్షన్ డిజైన్ బాగున్నాయి. శ్రీచరణ్ పాకాల స్కోర్ సినిమాలో బాగుంది. సౌండ్ డిజైన్ ని నీట్ గా చేసుకున్నారు. ప్రవీణ్ కే బంగర్రి కెమెరా వర్క్ బాగుంది. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ కూడా పర్వాలేదు.
ఇక దర్శకుడు యుగంధర్ ముని విషయానికి వస్తే.. తన వర్క్ ఈ సినిమాకి బాగుంది. మెయిన్ గా తాను ఎంచుకున్న కోర్ పాయింట్ ఈ సినిమాలో మెప్పిస్తుంది. దీనికి అనుగుణంగా అల్లుకున్న కథనంలో కొంచెం ట్రాక్ మాత్రం రెగ్యులర్ గా ఉంది కానీ మిగతా సస్పెన్స్ ఇంకా డివోషనల్ మూమెంట్స్ మాత్రం మెప్పిస్తాయి. అవి మినహా తన వర్క్ ఈ సినిమాకి బాగుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ‘శంబాల’ చిత్రం ఒక డీసెంట్ డివోషనల్ అండ్ సైన్స్ మిక్స్డ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. దర్శకుడు తీసుకున్న కోర్ లైన్ ఇందులో బాగుంది. అలాగే దీనితో సాగే కొన్ని సీన్స్ కూడా ఇందులో బాగున్నాయి. కాకపోతే ఆ ఊరిలో జరిగే ట్రాక్ మాత్రం రొటీన్ గా అనిపిస్తుంది. ఇది మినహాయిస్తే ఈ సినిమా మెప్పిస్తుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team


