ఇంటర్వ్యూ : ‘ఆది’ – ‘బుర్రకథ’ ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటుంది !

Published on Jun 26, 2019 4:11 pm IST

రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ‘ఆది’ హీరోగా నటిస్తున్న రెండు మెద‌ళ్ల‌తో పుట్టిన హీరో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడ‌నే కాన్సెప్ట్‌ తో రాబోతున్న చిత్రం ‘బుర్రకథ’. కాగా ఈ సినిమా జూన్ 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా హీరో న‌వీన్ పొలిశెట్టి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం..

 

మీరు డ్యూయల్ రోల్స్ చెయ్యడం ఫస్ట్ టైం కదా.. ఎలా అనిపించింది ?

 

ఛాలెంజింగ్ గా అనిపించింది. ఛాలెంజ్ ఉన్నప్పుడే రిలాక్స్ అవ్వం. అయితే నేను ఫస్ట్ భయపడింది మాత్రం అసలు ఈ రెండు పాత్రల మధ్య వేరియేషన్స్ నేను చూపించగలనా లేదా అని భయ పడ్డాను. ఇప్పుడు కూడా ఆ భయం ఉంది. రేపు 28 తరువాత ప్రేక్షకులు బాగుంది అంటే.. నేనప్పుడు హ్యాపీ.

 

హీరో రెండు మెద‌ళ్ల‌తో పుడతాడు అంటే ఎలా నమ్మారు ?

 

నేను ఇదివరకే ఇదే కాన్సెప్ట్‌ మీద ఒక ఆర్టికల్ చదివాను. సేమ్ అదే పాయింట్ తో డైరెక్టర్ గారు వచ్చి కథ చెప్పాక నాకు చాల నమ్మకం వచ్చింది.

 

సినిమాలో మీ పాత్రల గురించి చెప్పండి ?

 

సినిమాలో అభి అండ్ రామ్ అనే పాత్రల్లో నటించాను. అభి పాత్ర ప్రస్తుతం ఉన్న యూత్ కి చాలా దగ్గరిగా ఉంటుంది. ఇక రామ్ పాత్ర కాస్త వైవిధ్యంగా ఉంటుంది. రామ్ పాత్ర చేయడం నాకు కొంచెం కొత్తగా అనిపించింది.

 

అభి – రామ్ పాత్రల్లో ఏ పాత్ర మీకు దగ్గరిగా ఉంటుంది ?

 

నా గురుంచి తెలిసినవాళ్లకు మాత్రమే తెలుసు. నాలో అభినే ఎక్కువ ఉన్నాడు. అయితే రామ్ కూడా అప్పుడప్పుడు నాలో కనిపిస్తుంటాడు.

 

కొత్త డైరెక్టర్ కదా.. బాగా తీస్తాడని ఎలా నమ్మారు ?

 

ఆయన కథ చెప్పిన విధానమే నండి. తనకి కథ మీద ఎంతో క్లారిటీ ఉంది. సినిమాని చాల బాగా తీసాడు.

 

సినిమా ఎలా ఉండబోతుంది ?

 

కాన్సెప్ట్ కొంచెం వైవిధ్యంగా ఉన్నా.. సినిమా మాత్రం ఫుల్ ఎంటర్ టైన్ గా ఉటుంది. ముఖ్యంగా డైలాగ్స్ అలాగే సినిమాలో బెస్ట్ కామెడీ ఉంటుంది.

 

మీ సినిమాతో పాటుగా పోటీగా మరో మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి ?

 

లాస్ట్ వీక్ కూడా ఐదు సినిమాలు దాకా రిలీజ్ అయ్యాయి. ఈ వీక్ కూడా మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఖచ్చితంగా పోటీ ఉటుంది. అయితే సినిమా బాగుంటే.. అన్ని సినిమాలను జనం చూస్తున్నారు.

 

మీ తదుపరి సినిమాలు గురించి చెప్పండి ?

 

‘జోడి’, ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సినిమాలు ఆల్ మోస్ట్ పూర్తయ్యాయి. అలాగే మరో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఆ మూడు సినిమాల్లో ఒక సినిమా తమిళ్ – తెలుగు రెండు భాషల్లో చేస్తున్నాం. ప్రస్తుతం బుర్రకథ రిలీజ్ కోసమే వెయిట్ చేస్తున్నాను.

సంబంధిత సమాచారం :

More