ఆది ‘బుర్రకథ’ ట్రైలర్-ఒక్కడే కానీ వైలెంట్ గా సైలెంట్ గా.

Published on Jun 24, 2019 12:20 pm IST

ఆది హీరోగా డైమండ్ రత్న బాబు దర్శకత్వంలో ఓ విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న మూవీ “బుర్ర కథ”. రెండు విరుద్ధ భావాలున్న వ్యక్తిగా ఆది నటిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ నేడు చిత్ర యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ లో ఆది తన పాత్ర స్వభావం తెలియజేసే వాయిస్ ఓవర్ తో ప్రారంభం అవుతుంది. అభి రామ్ అని పేరుగల ఆది వైలెంట్ మరియు సైలెంట్ ఆలోచనలు కలిగిన ముల్టీపుల్ పెర్సనాలిటీ డిజార్డర్ తో బాధపడే వ్యక్తిగా కనిపిస్తున్నాడు.దీనివలన తనకి ఎదురైయ్యే మానసిక సంఘర్షణ ప్రధాన కథాంశంగా ఈ మూవీ తెరకెక్కినట్లు కనిపిస్తుంది. ఇక హీరోయిన్ మిస్త్రీ చక్రబోర్తి సామజిక భావాలు కలిగిన సోషల్ ఆక్టీవిస్ట్ గా కనిపిస్తుంది. పాటలలో ఆమె గ్లామర్తో అలరించింది.

రాజేంద్రప్రసాద్, ఆది తండ్రిగా కీలకపాత్ర పోషించారు,ఆయన చెప్పిన ఎమోషనల్ డైలాగ్స్ అలాగే పవర్ఫుల్ డైలాగ్స్ బాగున్నాయి. టీజర్ లో పోసాని,చంద్ర,పృథ్వి కామెడీ బాగుంది. ప్రభాస్ సాహో టీజర్ లోని ప్రభాస్ ,శ్రద్దా కపూర్ చెప్పే “వాళ్లు ఎవరంటే….,నా ఫ్యాన్స్…..,మరీ ఇంత వైలెంట్ గా ఉన్నారూ” డైలాగ్ కి పృధ్వి చేసిన స్పూఫ్ బాగుంది. ఇక అభిమన్యు సింగ్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు. మొత్తానికి టీజర్ లో కామెడీ,రొమాన్స్,ఎమోషన్స్ ,యాక్షన్ అన్ని అంశాలు మిక్స్ చేసి కట్ చేశారు. ఈ నెల 28విడుదల కానున్న ఈ మూవీ ఆదికి సక్సెస్ ఇస్తుందనిపిస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More