ఆది, రకుల్ ప్రీత్ జంటగా నటించిన ‘రఫ్’ సినిమా నవంబర్ నేలాఖరిలో విడుదలై ఆ వారాంతరం విడుదలైన సినిమాలలో పెద్ద హిట్ గా నిలిచింది. 400 స్క్రీన్ లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు విజయవంతంగా 200 స్క్రీన్ లలో నడుస్తుంది. హైదరాబాద్ లో ఈ చిత్ర విజయాన్ని ఈరోజు బృందమంతా జరుపుకున్నారు
ఈ వేడుకలో ఆది మాట్లాడుతూ సినిమాను ఇంతటి ఘనవిజయంగా మలిచిన ప్రేక్షకులకు రుణపడి వుంటానని తెలిపాడు. టాలీవుడ్ లో రకుల్ మొదలుపెట్టిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే కావడం అదనపు ఆకర్షణ. అభిలాష్ నిర్మాణంలో సుబ్బా రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది


