మాస్ అండ్ క్లాసీగా “ఆదికేశవ” ఫస్ట్ సింగిల్.!

Published on Sep 9, 2023 1:09 pm IST


మెగా యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి తెరకేకించిన ఇంట్రెస్టింగ్ చిత్రం “ఆదికేశవ”. మరి ఈ చిత్రంతో మంచి మాస్ ఇమేజ్ ని కూడా టార్గెట్ చేసిన వైష్ణవ్ తేజ్ ఇప్పటికే టీజర్ పోస్టర్ లతో మంచి హైప్ ను అందుకున్నాడు.

ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ అయితే ఇపుడు ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. ఇపుడు మంచి ఫామ్ లో ఉన్న తమిళ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించగా తాను ఇచ్చిన ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అయితే మంచి క్లాస్ అండ్ మాస్ గా ఉందని చెప్పాలి.

రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన సాహిత్యం అలాగే రాహుల్ సిప్లిగంజ్ గాత్రంతో మంచి మాస్ గా ఈ సాంగ్ అనిపిస్తుండగా విజువల్ పరంగా చాలా రిచ్ గా ఈ సాంగ్ విదేశాల్లో కనిపిస్తుంది. అలాగే వైష్ణవ్ మరియు శ్రీలీల ల కెమిస్ట్రీ మెయిన్ గా ఇద్దరూ కూడా తమ డాన్స్ స్టెప్స్ తో ఇంప్రెస్ చేసారని చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఆదికేశవ ఫస్ట్ సాంగ్ బాగానే ఉంది. ఇక ఫుల్ ఆల్బమ్ ఎలా ఉంటుందో చూడాలి.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :